India v/s Ireland : The Most Fastest Bowling Squad That India Had Says Sachin Tendulkar | Oneindia

2018-06-26 153

The Indian team played with England, andknow they have to face Ireland in a two-match T20 series on June 27 and 29 at Dublin.Legendary Indian batsman Sachin Tendulkar has said that Indian Had fast bowling Squad and Sachin mentioned that the Bhuvneshwar & Hardik as all-rounders in Team.

ఇంగ్లాండ్ పర్యటనకి మునుపెన్నడూ లేనంత బలమైన బౌలింగ్ లైనప్‌తో భారత్ జట్టు వెళ్తోందని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు అక్కడికి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో..సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడుతూ భారత జట్టు ఆటగాళ్ల సామర్థ్యాలపై విశ్లేషించాడు.
ఇక ప్రస్తుతం భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లో మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది. జట్టులో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్, ఎత్తైన బౌలర్ ఇషాంత్ శర్మ, స్కిడ్డీ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా, వేగవంతంగా బంతులు విసిరే ఉమేశ్ యాదవ్‌లు ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్‌ దొరికితే.. జట్టుకి అదనపు ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే.. ఈ బౌలింగ్ అటాక్ అత్యుత్తమని నా అంచనా అని సచిన్ తెలిపారు.